నిబంధనల ప్రకారం .. కరోనా కేసులు భారీగా పెరిగితే టర్మ్ 2 పరీక్షలను వాయిదా లేదా రద్దు చేసే అవకాశం ఉంది. ఈ ఏడాది రెండు టర్మ్‌ల్లో పరీక్షలను నిర్వహిస్తామని సీబీఈఎస్‌ఈ ప్రకటించినప్పుడు తన అధికారిక నోటీస్‌లో ఇలా కూడా్కొంది. కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తే .. టర్మ్ 1 పరీక్షలు, ఇంటర్నల్ అసెస్మెంట్ ఆధారంగా తుది ఫలితాలను విడుదల చేస్తామని బోర్డు నోటీస్‌లో పేర్కొంది.
#CBSE has said if covid cases increase then there shall be MCQ now that cases are increasing its high time to make term 2 internal Assessment or MCQ only like term 1. pic.twitter.com/TtP5pZK0hF
— random (@random41944271) April 16, 2022
it’s true aff#cbseterm2 #CBSE #InternalAssessmentForAll2022 #CBSEExams pic.twitter.com/D82JH22Tp3
— AYUSHKA NANDA (@ayushka_nanda) April 16, 2022
గతంలో 2021 లో కరోనా మహమ్మారి కారణంగా బోర్డు ఎలాంటి పరీక్షలను నిర్వహించలేకపోయింది. 2020 లో సైతం కోవిడ్ -19 మహమ్మారి ఫస్ట్ వేవ్ కారణంగా పరీక్షలను మధ్యలోనే ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సీబీఎస్ఈ పరీక్షలు, మూల్యాంకన వ్యవస్థలో భారీ అంతరాయాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ ఏడాది రెండు టర్మ్‌ల్లో పరీక్షలు నిర్వహించాలని సీబీఎస్ఈ నిర్ణయం తీసుకుంది.
#cancelboardexams2022 #cbse there are students who lost their parents or themselves suffering in hospitals,as there is spike in death rates so doesn’t it count?how do you think they will write with tht mental stability?pls think abt it before telling us to attend the exam .
— jiaa.k (@jiaa72567665) April 21, 2022
ప్రస్తుతం కరోనా పరిస్థితి అంత తీవ్రంగా లేనప్పటికీ, చాలా విద్యార్థులు, విద్యావేత్తలు టర్మ్ 2 పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక టర్మ్ 1 పరీక్షల రద్దు చేయాలనే డిమాండ్‌తో పాటు తుది ఫలితాలను ఇంటర్నల్ అసెస్మెంట్ ఆధారంగా విడుదల చేయాలని కోరుతుండడం గమనార్హం.
What a justice….
6-7 months for term 1
4 months for term 2..
We want result on basis of #BestOfEitherTerms or Please give some more time at least 20 days more.#cbseterm2 #CBSE— Anonymous (@preapexx) April 21, 2022
ఈ ఏడాది అకడమిక్ ప్రారంభం నుంచి డేటాను సేకరించాలని cbse పాఠశాలలను కోరింది. సంవత్సరం పొడవునా చేపట్టిన అన్ని అసెస్మెంట్ల కోసం విద్యార్థుల ప్రొఫైల్‌ను రూపొందించాలని పాఠశాలలను ఆదేశించింది. 10 వ తరగతికి సంబంధించి మూడు ఆవర్తన పరీక్షలు, విద్యార్థులను మెరుగుపరచడం, పోర్ట్‌ఫోలియో, ప్రాక్టికల్ వర్క్, స్పీకింగ్ లిజనింగ్ యాక్టివిటీస్ నిర్వహించాలి. ఇక 12 వ తరగతికి సంబంధించిన అంతర్గత మూల్యాంకనంలో ప్రతి టాపిక్ పూర్తయిన తరువాత యూనిట్ పరీక్షలు, అన్వేషణాత్మక కార్యకలాపాలు, ప్రాక్టికల్‌లు, ప్రాజెక్ట్‌లు ఉంటాయి. CBSE ఇంకా కచ్చితమైన వెయిటేజీని ప్రకటించనప్పటికీ ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం, టర్మ్ 1, టర్మ్ 2, ఇంటర్నల్ అసెస్మెంట్ కలిసి ఫలితాలను లెక్కించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: board exams, Career and Courses, CBSE, Crown, Students
telugu.news18.com